
అఖిలభారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లో ఘనంగా గణతాంత్ర దినోత్సవం
అఖిలభారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లో ఘనంగా గణతాంత్ర దినోత్సవం
కోసిగి (పల్లెవేలుగు) 27 జనవరి: ప్రజలందరికీ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అఖిలభారత కాంగ్రెస్ పార్టీ చరిత్ర ప్రజలందరికీ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అఖిలభారత కాంగ్రెస్ పార్టీ చరిత్ర సత్యాన్ని దేశ పౌరులందరూ గ్రహించాలని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే జిలాని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే జిలాని మాట్లాడుతూ దేశ ప్రజలందరూ గౌరవం పొందే విధముగా అన్ని రంగాల్లో దేశవ్యాప్తంగా అభివృద్ధి చేసిందే అఖిలభారత కాంగ్రెస్ పార్టీ మహా నాయకులపై కొంతమంది విషం కక్కడమే పనిగా పెట్టుకొని దేశ ప్రజలను తప్పు దోవ పట్టిం చి అధికారములోకి వచ్చిన, నరేంద్ర మోడీ పాలనలో దేశ ప్రజల మర్యాదపూర్వకమైన సొమ్ము ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని పలువురు పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టి ప్రజాస్వామ్య సమాజ ఐక్యత దేశ సంపదను సర్వనాశనము చేసే పాలన తీరు వల్ల ప్రజలందరూ అవమానించబడడం తప్ప మరి ఏమి లేదని గ్రహించే దేశవిశ్వాసులందరూ రానున్న ఎన్నికల్లో అఖిలభారత కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి తెచ్చుకోవడమే దేశ పౌరుల బాధ్యతగా ప్రజలందరూ భావిస్తున్నారని కాంగ్రెస్ మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే జిలాని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో మంత్రాలయం ఇన్చార్జ్ బాబురావు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కార్తీక్ జయం వరప్రసాద్, కాంగ్రెస్ నాయకులు షబ్బీర్, హాజీ ముస్తఫా, నజీర్ ఆదం లతీఫ్ కలందర్ రహీం షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.