
YSR KADAPA
అక్రమ రేషన్ బియ్యం పట్టివేత.
అక్రమ రేషన్ బియ్యం పట్టివేత.
ఎర్రగుంట్ల (పల్లె వెలుగు) ఫిబ్రవరి 13 : ఎర్రగుంట్ల మండల పరిధి లోని చిలంకూరు గ్రామం వద్ద అక్రమంగా ఆటోలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నామని ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు సోమవారం ఆయన వివరాలను విలేకరులకు వెల్లడించారు చిలంకూరు గ్రామం వద్ద అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న పాయసం రాముడు అనే వ్యక్తి వద్ద నుండి 900 కేజీల రేషన్ బియ్యం మరియు ఆటోని స్వాధీనం చేసుకున్నామని నిందితుడు పాయసం రాముడు నీ అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.