Dhone

అక్రమ అరెస్ట్ లను ఖండిస్తున్నాం, ఆ స్థలాలకు పట్టాలు ఇవ్వాలి – CPM

అక్రమ అరెస్ట్ లను ఖండిస్తున్నాం, ఆ స్థలాలకు పట్టాలు ఇవ్వాలి – CPM

డోన్ పల్లె వెలుగు: పట్టణం శివారులోని రుద్రాక్ష గుట్టలో 2007లో వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో దాదాపు 750మంది పేదప్రజలు ఇంటి స్థలం లేనివారికి ఇంటి స్థలం ఇచ్చారని భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్కిస్ట్స్, సీపీఎం) మండలం కార్యదర్శి కోయలకొండ నాగరాజు, పట్టణ కార్యదర్శి నక్కి శ్రీకాంత్, సీపీఎం సీనియర్ నాయకులు కొండయ్య, సిపిఎం మండల కమిటీ సభ్యులు టి శివరాం, నాగమాద్దయ్య, రామాంజనేయులు, చిన్న రహిమాన్ లు స్థానిక సిపిఎం కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్లతో సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమంగా వామపక్ష పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం దుర్మార్గమైన విషయం అని, అక్రమ అరెస్ట్ లతో ఉద్యమాలు ఆపలేరని, అక్రమ అరెస్టు ను మేము ఖండిస్తున్నామన్నారు. పేద ప్రజలు అక్కడ బేసుమట్టం వేసుకొన్నారని, అయితే అప్పట్లో అక్కడ కనీస సౌఖర్యాలు లేకపోవడం వలన లబ్ధిదారులు పూర్తి స్థాయిలో నిర్మాణం చేసుకోలేక పోయారని,  అయిన కొంతమంది అక్కడనే నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటెన్ అప్పటి మండల తహసీల్దార్  మీకు పట్టాలు ఇస్తామని చెప్పగా అధికారుల మాటలు నమ్మి కాపురము ఉన్నవారు కూడా ఇప్పుడు అక్కడ నుండి ఖాళీచేసారని వారు అన్నారు. ఆ స్థలాలలో పేదలు లక్షలు ఖర్చులు పెట్టి బేస్ మట్టాలు కట్టారని, వాటిని జేసీబీలతో చదునుచేయడం కరెక్ట్ కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోజుల్లో హాస్పిటల్ కోసం స్థలం వదలండి మిగతా వాటికి పట్టాలు ఇస్తామని స్థానిక వైస్సార్సీపీ నాయకులు చెప్పి, పేద ప్రజలను నమ్మించి మోసం చేయడం దారుణమన్నారు.  తక్షణమే రాష్ట్ర ఆర్థిక శాఖ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించి అదే స్థలాలకు పట్టాలు పంపిణి చేయాలని  మంత్రి ని కోరారు.

naveen kumar

Naveen Kumar Reporter, Dhone Nandyal Dist.
Back to top button