panyam

అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ త్వరత గతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కు వినతి

అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ త్వరత గతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కు వినతి

పాణ్యం (పల్లెవెలుగు) 12 సెప్టెంబర్: నంద్యాల జిల్లా లోని కలెక్టర్ కార్యాలయం లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమం లో పాణ్యం మండలం లోని కౌలురు బలపనూరు హైస్కూలు నందు దాదాపుగా 250 మంది విద్యార్థులు వున్నారని అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కట్టడం ప్రజా ప్రతినిధులు మరచి పోయారని స్థానిక బలపనూరు హైస్కూల్ 27.06.1948 స్థాపించిన కానీ ఇంత వరకు అండర్ బ్రిడ్జి లేక విద్యార్థులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అభివృద్ధికి చిహ్నాలుగా రహదారులంటూ ప్రభుత్వం దశాబ్దకాలంగా ఎన్ హెచ్ 40 జాతీయ రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయని రహదారి నిర్మాణాల్లో నిర్మాణ సమయంలో పదుల సంఖ్యలో ప్రజలు, వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారని బ్రిడ్జి పనులు త్వరత గతిన పూర్తి చేయించి రోడ్డు ప్రమాదాలతో కౌలూరు గ్రామా ప్రజలకు కాపాడాలని మల మహానాడు  దేవదత్తు  జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు.

Back to top button