panyam

అంగన్వాడి వర్కర్స్ కనీస వేతనాలు26వేల రూపాయలు ఇవ్వాలి

అంగన్వాడి వర్కర్స్ కనీస వేతనాలు26వేల రూపాయలు ఇవ్వాలి

  • రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవచ్చిన. జీఓ నెంబర్ ఒకటిని రద్దు చేయాలి,తహశీల్దార్ మల్లికార్జున రెడ్డి కి వినతిపత్రం

పాణ్యం, పల్లెవెలుగు,10 జనవరి:  మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు, అనంతరం సీఐటీయూ మండల కార్యదర్శి భాస్కర్, అంగన్వాడి యూనియన్ లీడర్, వెంకటమ్మ మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం, ఫేస్ యాప్ రద్దు చెయ్యాలని, కేంద్రాలకు మౌలిక వసతులు కల్పించాలని, లబ్ధిదారులకు ఇచ్చే పౌష్టికాహార క్వాంటిటీ పెంచాలని వైఎస్సార్ సంపూర్ణ పోషణ మెనూ చార్జీలు పెంచాలని, అంగన్వాడీలకు సెంటర్ల పర్యవేక్షణ పేరుతో వేధింపులు ఆపాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు సెంటర్ పరిధిలోని పేద గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకి అనేక సేవలు అందిస్తున్నారన్నారు. అంగన్వాడీ సెంటర్లో మౌలిక వసతులు లేవు. కొన్ని కేంద్రాలలో, అసలు విద్యుత్ సౌకర్యంలేదని  విద్యుత్ సౌకర్యం ఉన్న ప్రభుత్వం బిల్లులు చెల్లించటంలేదన్నారు. టీఏ, డీఏలు గత 5 సంవత్సరాల కాలంగా ప్రభుత్వం చెల్లించడంలేదన్నారు. వైఎస్సాఆర్ సంపూర్ణ పోషణ అమలుకు కొన్ని ప్రాజెక్టుల్లో గత 6 నెలల నుండి బిల్లులు చెల్లించలేదని . దీని వలన అంగన్వాడీలు అప్పులు చేసి లబ్ధిదారులకు ఆహారం వండిపెడుతున్నారు. రకరకాల యాప్లు తీసుకొచ్చి పనిభారం పెంచారు. కానీ వేతనాలు పెంచలేదు. అంగన్వాడీలకు ఇచ్చిన ఫోన్లు. పనిచెయ్యడం లేదు. గ్రామాల్లో నెట్ సౌకర్యం ఉండటం లేదని . ఫేస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని . ఇది అమలు చెయ్యడం సాధ్యంకానిపని అని  రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని అమలు చేస్తున్న మెనూకు తగిన విధంగా మెనూచార్జీలు, సరుకుల క్వాంటిటీ పెంచలేదు. ఇప్పటికీ పౌష్టికాహారంలో ఇచ్చే మెనూ నిమిత్తం ఒక్కొక్క పిల్లవాడికి కేవలం 5 గ్రాముల నూనె, 15 గ్రాములు నాశిరకం కందిపప్పు ఇస్తున్నారు. కొన్ని ప్రాజెక్టులలో గత 2 నెలల నుండి ఆయిల్, పప్పు ఇవ్వలేదు. గ్యాస్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వంపట్టించుకోవటం లేదు. ఉద్యోగభద్రతలేదు, అంగన్వాడీ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సచివాలయాల పర్యవేక్షణలో చేయాలని నిర్ణయించారు. ఈ పాటికే ఐసిడిఎస్ అధికారులు పీడీ, సీడీపీఓ, వైజర్లు పర్యవేక్షిస్తున్నారు. సెంటర్లను బలోపేతం చెయ్యడానికి నిధులు పెంచి అంగన్వాడీలకు ఉద్యోగభద్రత కల్పించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయాల పర్యవేక్షణ చేయాలని, ఫుడ్ కమీషనర్, ఎం.ఎస్.కె, ఎం.ఆర్.ఓ, ఎం.డి.ఓ, రాజకీయ నాయకులు ఇలా అనేక మంది విజిట్ల పేరుతో అంగన్వాడీలను అవమానిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారు. అంగన్వాడీలు మానసిక ఒత్తిడికి గురై అనారోగ్యం పాలౌతున్నారు. ఇటీవల రాజమండ్రిలో ఒక వర్కర్ అంగన్వాడీ సెంటర్లోనే గుండెపోటుతో మరణించింది. కొంత మంది రాజీనామాకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల మీద పనిభారం తగ్గించాలని, వేధింపులు ఆపాలని క్రింది సమస్యలు పరిష్కారం చెయ్యాలని కోరుతూ వినతి పత్రాన్ని అందించారు.

1. అంగన్వాడీలకు కనీస వేతనం రూ. 26,000/- ఇవ్వాలి. 2. అంగన్వాడీలకు ఫేస్ యాప్ రద్దు చెయ్యాలి, పర్యవేక్షణ పేరుతో వేధింపులు ఆపాలి.

3. వైఎస్సార్ సంపూర్ణ పోషణ మెనూ చార్జీలు పెంచాలి. గ్యాసును ప్రభుత్వమే సరఫరా చెయ్యాలి. 4. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ అమలు చేయాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు ఇవ్వాలి, వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలి.

5. సీనియారిటీ ప్రకారం వేతనాలు ఇవ్వాలి, సూపర్ వైజర్ పోస్టులలో వయోపరిమితి తొలగించాలి.

6. హెల్పర్ల ప్రమోషన్లకు వయోపరిమితి 50 సం॥లకు పెంచాలి. ప్రమోషన్లో రాజకీయ జోక్యం అరికట్టాలి.

7. 300 జనాభా దాటిన మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలి. వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలి. మినీబి సెంటర్లోని వర్కర్లను మెయిన్ వర్కర్లుగా తీసుకోవాలి. అదనంగా హెల్పర్న ఇవ్వాలి.

8. లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేయాలని, ఆయిల్, కందిపప్పు క్వాంటిటీ పెంచాలి.

9. ర్యాలీలు, సభలను నిషేదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నెం. 1ని రద్దుచెయ్యాలి.కార్యక్రమంలో వెంకటమ్మా, మరియమ్మ మబ్బుని లక్ష్మీ దేవి, తదితరులు పాల్గొన్నార

deva dattu

Devadattu Reporter Panyam
Back to top button